Rashmika Mandanna: థాజ్జ్ ద వైబ్’’ అంటూ రష్మిక మందన్న పోస్ట్..

by Anjali |   ( Updated:2025-04-11 16:54:31.0  )
Rashmika Mandanna: థాజ్జ్ ద వైబ్’’ అంటూ రష్మిక మందన్న పోస్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న (National Crash Rashmika Mandanna) ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ బ్యూటీ పుష్ప, యానిమల్ వంటి చిత్రాలతో డబుల్ స్టార్ డమ్ సంపాదించుకుంది. ముఖ్యంగా పుష్ప రెండు భాగాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. రీసెంట్‌గా ఈ రష్మిక మందన్న అద్భుతమైన చిత్రం ఛావాలో నటించి మెప్పించిది. తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టింది. ప్రారంభంలో ఈ బ్యూటీ నటించిన సినిమాలు కూడా హిట్ టాక్ సొంతం చేసుకున్నాయని చెప్పుకోవచ్చు.

మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఛలో, గీతా గోవిందం (Geetha Govindam), డియర్ కామ్రేడ్ (Dear Comrade) వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇకపోతే ఈ బ్యూటీ అటు సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలోని అభిమానులతో తరచూ టచ్‌లో ఉంటుంది. తరచూ ఏదో ఒక పోస్ట్‌తో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. తాజాగా రష్మిక మందన్న తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘కొన్నిసార్లు మీరు పోజులు ఇవ్వడం.. ఇతర పనులతో చాలా పని పూర్తి చేసినప్పుడు మీకు ఏమీ చేయాలని అనిపించదు. కానీ మీ బెస్టీ మిమ్మల్ని తిరిగి పొందారు. థాజ్జ్ ద వైబ్’’ అంటూ రష్మిక మందన్న రాసుకొచ్చింది. ఇకపోతే రీసెంట్‌గా ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే.



Next Story

Most Viewed