- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rashmika Mandanna: రిటైర్మెంట్‌పై సంచలన కామెంట్స్ చేసిన నేషనల్ క్రష్.. షాక్‌లో ఫ్యాన్స్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna), బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘చావా’(Chaava).

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna), బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘చావా’(Chaava). లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దివ్యంజలి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దినేష్ విజయన్(Dinesh Vijayan) నిర్మిస్తున్నారు. ఇక ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో.. అక్షయ్‌ఖన్నా(Akshay Khanna), అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ మూవీ ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో తాజాగా ముంబాయిలో దీని ట్రైలర్ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు. అయితే అక్కడ రష్మిక మందన్న చేసిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. “ఈ సినిమాలో శంభాజీ భార్య ఏసుబాయిగా నటించే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఒక నటిగా నాకు ఇంతకు మించి ఏం కావాలి. ఈ మూవీ తర్వాత నేను హ్యాపీగా రిటైర్ అవ్వగలను అని డైరెక్టర్‌తో ఓక సందర్భంలో చెప్పాను. అంత గొప్ప పాత్ర ఇది. చావా షూటింగ్ టైంలో ఎన్నో సార్లు భావోద్వేగానికి గురయ్యా. ట్రైలర్ చూశాక కూడా చాలా ఎమోషనల్ అయ్యా.
విక్కీ కౌశల్ ఇందులో నాకు దేవుడిలా కనిపిస్తున్నాడు. ఈ సినిమా కోసం డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ నన్ను సంప్రదించినప్పుడు ఆశ్చర్యపోయా. ఏమీ ఆలోచించకుండా వెంటనే అంగీకరించా. ఈ పాత్ర కోసం ఎన్నో రిహార్సల్స్ చేశా. టీమ్ అంతా ఎంతో సహకరించింది. ఈ మూవీలోని పాత్రలు అందరినీ ప్రభావితం చేస్తాయి” అని రష్మిక చెప్పుకొచ్చింది. దీంతో ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక దీనిపై నెటిజన్లు, ఫ్యాన్స్ నిజంగానే ఈ సినిమా తర్వాత నేషనల్ క్రష్ రిటైర్మెంట్ తీసుకుంటుందా అంటూ షాక్ అవుతున్నారు.






