Rashmika Mandanna : పాన్ ఇండియా మూవీలో యోధురాలుగా రష్మిక మందన్న.. కొత్త సినిమా అప్డేట్‌తో ఆనందంలో ఫ్యాన్స్

by Chukka Sudharani |   (  Updated:2025-07-26 09:30:43  IST  )

‘చలో’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న.. అనతికాలంలోనే నేషనల్ క్రష్‌గా మారి ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది.

Rashmika Mandanna : పాన్ ఇండియా మూవీలో యోధురాలుగా రష్మిక మందన్న.. కొత్త సినిమా అప్డేట్‌తో ఆనందంలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: ‘చలో’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న.. అనతికాలంలోనే నేషనల్ క్రష్‌గా మారి ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక ‘పుష్ప’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని.. ప్రజెంట్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ‘కుబేరా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ అమ్మడు. అలాగే ప్రస్తుతం తెలుగులో ‘గర్ల్‌ఫ్రెండ్’, హిందీలో ‘థామా’ వంటి చిత్రాల్లో నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న రష్మిక రీసెంట్‌గా మరో సినిమా ఓకే చేసినట్టు తెలుస్తోంది.

‘మైసా’ అనే టైటిట్‌తో తెరకెక్కేందుకు సిద్ధం అవుతున్న ఈ చిత్రం లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెలుస్తుంది. అలాగే.. ఈ పాన్ ఇండియా సినిమాను ఏకంగా ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇందులో రష్మిక యోధురాలిగా కనిపిస్తుంది. రవీంద్ర పూలే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు రేపు జరగబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ మేరకు ‘తుఫాను ఎగసిపడబోతోంది.. రేపు ఒక శక్తివంతమైన ప్రయాణం స్టార్ట్ కానుంది. రేపు ఉదయం 11 గంటలకు MYSAA పూజా వేడుక జరగనుంది’ అంటూ తెలిపారు.

Next Story