- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నా డబుల్ గడ్డం, ముక్కు వెంట్రుకల్ని ప్రపంచానికి చూపిద్దాం’: నేషనల్ క్రష్ రష్మిక మందన్న
నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) సికందర్ (Sikander) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) సికందర్ (Sikander) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. సికందర్ ఈద్ అల్-ఫితర్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 30 మార్చి 2025న స్టాండర్డ్.. IMAX ఫార్మాట్‌లలో థియేట్రికల్‌గా విడుదల కానుంది.
ఇకపోతే ఈ బ్యూటీ తెలుగులో పలు చిత్రాల్లో నటించి.. మంచి గుర్తింపు సొంతం చేసుకుంటోంది. ముఖ్యంగా యానిమల్ అండ్ పుష్ప రెండు భాగాల్లో అద్భుతంగా నటించింది. ఈ అమ్మడు యాక్టింగ్‌కు నెటిజన్లు ఫిదా అయిపోయారనడంలో అతిశయోక్తిలేదు. యానిమల్(Animal) లో రణబీర్(Ranbir)కు భార్యగా.. పుష్ప మొదటి భాగంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu Arjun)కు ప్రేయసిగా..
సెకండ్ పార్ట్‌లో భార్యగా నటించి ఉత్తమ నటిగా పేరే గాంచింది. ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటోన్న నటీమణుల్లో రష్మిక మందన్న ఒకరని చెప్పుకోవచ్చు. అయితే ఈ భామ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘నా డబుల్ గడ్డం అండ్ నా ముక్కు జుట్టును ప్రపంచానికి చూపిస్తాను. ’’ అంటూ రాసుకొచ్చి తన ఫొటోలు పంచుకుంది.






