- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rashmika: నా ప్రాణ స్నేహితుడు అంటూ.. రష్మిక మందన్న ఆసక్తికర పోస్ట్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న (National Crush Rashmika Mandanna) క్రేజ్ అంతా ఇంతా కాదు.

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న (National Crush Rashmika Mandanna) క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ అమ్మడు ఛలో (Chalo) చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. ఏకంగా అగ్ర హీరోల సరసన అవకాశం దక్కించుకుంటూ మరింత క్రేజ్ సొంతం చేసుకుంటుంది. ఈ బ్యూటీ కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళం భాషల్లో కూడా అవకాశాలు సొంతం చేసుకుంటూ అగ్ర కథానాయికల జాబితాలో చోటు దక్కించుకుంటుంది.
దేవదాస్, డియర్ కామ్రేడ్ (Dear Comrade), సరిలేరు నీకెవ్వరు, ఆడవాళ్లు మీకు జోహార్లు, భీష్మ (Bhishma), సుల్తాన్, గుడ్ బై, వారసుడు (Vārasuḍu), మిషన్ మజ్ను (Mission Majnu) వంటి చిత్రాల్లో నటించి జనాల మెప్పు పొందింది. అలాగే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప (Pushpa) రెండు భాగల్లో నటించి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో పాన్ ఇండియా నటి అయిపోయింది.
ఈ మూవీలో పుష్పరాజ్(Pushparaj) భార్యగా నటించి తెలుగు ప్రేక్షకుల వద్ద మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఛావా సినిమాలో మహారాణిగా కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. విక్కీ కౌశల్ (Vicky Kaushal), అక్షయ్ ఖన్నా (Akshay Khanna), డయానా పెంటీ (Diana Penty) ముఖ్య పాత్రల్లో నటించిన ఈ మూవీని లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) దర్శకత్వం వహించారు. మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మించారు. ఇదంతా పక్కన పెడితే..
నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన ఇన్‌స్టాగ్రామ్ వేదికన తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. సింపుల్ శారీ పిక్స్ అభిమానులతో పంచుకుంటూ ఓ క్యాప్షన్ కూడా జోడించింది. ‘‘కొన్నిసార్లు చాలా చివరి నిమిషంలో విషయాలు జరుగుతాయి. మీరే హెయిర్ మేకప్ స్టైలింగ్ చేసుకోవాలి. నా ప్రాణ స్నేహితుడిని నా ఫోటోలు తీయమని అడగాలి. అది నాకు చాలా ఇష్టం. ఇది నన్ను పూర్తిగా కాలేజీ రోజులకు తీసుకెళ్తోంది’’ అంటూ రష్మిక క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.






