- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rashmika Mandanna: ‘నాకు నైట్ షూట్స్ అంటే ఎంత ఇష్టమో ఆయనకు బాగా తెలుసు’: రష్మిక మందన్న
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఛలో (Chalo) చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఛలో (Chalo) చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఈ బ్యూటీ అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని.. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. సరిలేరు నీకెవ్వరు, దేవదాస్, డియర్ కామ్రేడ్ (Dear Comrade),గుడ్ బై, భీష్మ (Bhishma), సుల్తాన్, వారసుడు (Vārasuḍu), ఆడవాళ్లు మీకు జోహార్లు..
మిషన్ మజ్ను (Mission Majnu)వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. పుష్ప రెండు భాగాల్లో నటించి.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. ఈ బ్యూటీ కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, మలయాళం భాషల్లో కూడా అవకాశాలు సొంతం చేసుకుంటూ అగ్ర కథానాయికల జాబితాలో చోటు దక్కించుకుంటుంది.
ఇటీవల ఛావా సినిమాలో మహారాణిగా కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. విక్కీ కౌశల్ (Vicky Kaushal), డయానా పెంటీ (Diana Penty) ముఖ్య పాత్రల్లో నటించిన ఈ మూవీని లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) దర్శకత్వం వహించారు. మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మించారు. ఇదంతా పక్కన పెడితే..
ఇకపోతే నేషనల్ క్రష్ రష్మిక మందన్న తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన మూవీ షూటింగ్స్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షూటింగ్ గురించి రాసుకొచ్చింది. ‘‘నాకు నైట్ షూట్స్ అంటే ఎంత ఇష్టమో ఆదిత్య సార్‌కు చాలా స్పష్టంగా తెలుసు’’ అంటూ రాసుకొచ్చింది.
READ MORE ...
నటి రష్మికకు భద్రత కల్పించండి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ






