Rashmika Mandanna: ప్రేమ గురించి పోస్ట్ పెట్టిన రష్మిక మందన్న.. సాధ్యమైనంత వరకు అంటూ..

by Kodari Anjali |

నేషనల్ క్రష్ రష్మిక మందన్న (National Crash Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Rashmika Mandanna: ప్రేమ గురించి పోస్ట్ పెట్టిన రష్మిక మందన్న.. సాధ్యమైనంత వరకు అంటూ..
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న (National Crash Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ఏ ముహూర్తాన సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందో తెలియదు కానీ.. అతితక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళం, హిందీ భాషల్లో కూడా నటించే స్థాయికి ఎదిగింది.

ముఖ్యంగా పుష్ప రెండు భాగాల్లో నటించి.. పాన్ ఇండియా హీరోయిన్‌గా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. రణబీర్ కపూర్ (Ranbir Kapoor) సరసన యానిమల్ సినిమాలో కూడా నటించింది. అలాగే రష్మిక మందన్న నటించిన ఛావా చిత్రం నేడు తెలుగులో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న మహారాణి పాత్రలో నటించి నెటిజన్లను ఆకట్టుకుంది. నిండైన చీరకట్టులో అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇకపోతే ఈ అమ్మడు ఛలో చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న తర్వాత.. గీత గోవిందం (Geeta Govindam), యజమన,దేవదాస్, డియర్ కామ్రేడ్ (Dear Comrade), భీష్మ, సరిలేరు నీకెవ్వరు, పుష్ప, పొగరు, సుల్తాన్, ఆడవాళ్లు మీకు జోహార్లు, గుడ్ బై, సీతా రామం, వారసుడు, మిషన్ మజ్ను, వెంకీ కుడుములు, పుష్ప 2: ది రూల్ వంటి సినిమాల్లో నటించి రష్మిక మందన్న మంచి పేరు సంపాదించుకుంది. ఇదంతా పక్కన పెడితే..

ఈ బ్యూటీ తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్‌తో దర్శనమిస్తుందన్న విషయం తెలిసిందే. తాజాగా రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రామ్ వేదికన ఓ పోస్ట్ పెట్టింది. ‘‘గాయ్స్.. సాధ్యమైనంత వరకు సానుకూలంగా ఉండటానికి ప్రయత్నించండి. నవ్వండి - మనకు ఈ ఒక్క జీవితం మాత్రమే ఉంది. కాబట్టి దానిని పూర్తిగా జీవించండి.

ఇతరులతో కొంచెం దయగా ఉండండి. ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇతరులకు ప్రేమను ఇవ్వండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. వీలైనంత వరకు శరీరాన్ని హైడ్రేట్ చేసుకోండి. మీ శరీరాలకు ప్రేమను ఇవ్వండి. నా నుంచి అలాగే మీ నుంచి’’ అంటూ నేషనల్ క్రష్ ప్రేమ గురించి రాసుకొచ్చింది. ప్రస్తుతం నేషనల్ క్రష్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story