- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోలీవుడ్ స్టార్ హీరో సరసన రష్మిక మందన్న.. షూటింగ్‌లో జాయిన్ అయ్యేది అప్పుడే?
శివకార్తికేయన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు.

దిశ, సినిమా: శివకార్తికేయన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మదరాసితో పాటు మరో సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా.. ఇటీవల తన సినీ కెరీర్‌లో 24వ చిత్రాన్ని కూడా అనౌన్స్ చేసేసిన విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘గుడ్ నైట్’ ఫేమ్ వినాయక్ చంద్రశేఖరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాగా.. ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అంతే కాకుండా.. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అక్టోబర్‌లో స్టార్ట్ కానున్నట్లు తాజాగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. టీజర్ రిలీజ్ చేసి ఈ సినిమా అనౌన్స్ చేయనున్నారట మేకర్స్. ఇక ఈ మూవీలో రష్మిక మందన్నానను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్లు కోలీవుడ్ వర్గాల నుంచి సమాచారం వస్తుండగా.. అక్టోబర్‌లో స్టార్ట్ కాబోయే షూటింగ్‌లో రష్మిక, శివకార్తికేయన్ హాజరుకానున్నట్లు టాక్. అయితే.. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.






