వీల్ చైర్‌లో రష్మిక మందన్న.. ఈ సిట్యూవేషన్‌లో నిన్ను చూడలేకపోతున్నామంటున్న ఫ్యాన్స్

by Kavitha |   ( Updated:2025-01-22 06:19:15.0  )
వీల్ చైర్‌లో రష్మిక మందన్న.. ఈ సిట్యూవేషన్‌లో నిన్ను చూడలేకపోతున్నామంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ‘పుష్ప-2’(Pushpa-2) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది. ప్రస్తుతం ఈ భామ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉంది. అయితే రీసెంట్‌గా ఈ బ్యూటీకి కాలికి గాయమైన విషయం తెలిసిందే. జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా కాలు బెనికింది. గాయం నుంచి కోలుకునేందుకు నెలలు కూడా పట్టొచ్చేమో అని ఆమె తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. కాలికి కట్టుతో ఉన్న ఫొటోలను షేర్ చేసింది.

ఈ క్రమంలో ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తాజాగా రష్మిక మందన్న వీల్ చైర్‌లో దర్శనమిచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆమె నడవలేని స్థితిలో ఉండటంతో ఆమె సిబ్బంది తనని వీల్ చైర్‌లో తీసుకెళ్లారు. అయితే ఈ భామ తన ఫేస్ కనిపించకుండా క్యాప్ అండ్ మాస్క్‌తో కవర్ చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ త్వరగా కోలుకోవాలని, నిన్ను ఈ సిట్యూవేషన్‌లో చూడలేకపోతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed