బాలీవుడ్‌లో ‘నేనే నంబర్ 1’.. హిందీ ఇండస్ట్రీని శాసిస్తున్న సౌత్ భామ

by Sujitha Rachapalli |   (  Updated:2025-03-14 15:11:06  IST  )

సౌత్ హీరోయిన్ రష్మిక మందన్నా బాలీవుడ్‌ను శాసిస్తోంది. దీపికా పదుకొనే, అలియా భట్, కంగనా రనౌత్ లాంటి లేడీ సూపర్ స్టార్స్‌ను కనీసం రేస్‌లో కూడా లేకుండా చేసింది. మూడు వరుస బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్స్‌తో ‘నేనే నంబర్ 1’ అంటోంది.

బాలీవుడ్‌లో ‘నేనే నంబర్ 1’.. హిందీ ఇండస్ట్రీని శాసిస్తున్న సౌత్ భామ
X

దిశ, ఫీచర్స్ : సౌత్ హీరోయిన్ రష్మిక మందన్నా బాలీవుడ్‌ను శాసిస్తోంది. దీపికా పదుకొనే, అలియా భట్, కంగనా రనౌత్ లాంటి లేడీ సూపర్ స్టార్స్‌ను కనీసం రేస్‌లో కూడా లేకుండా చేసింది. మూడు వరుస బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్స్‌తో ‘నేనే నంబర్ 1’ అంటోంది. అవుట్ సైడర్‌గా తన సత్తాను చాటుతోంది. ఎస్.. ‘‘యానిమల్’’, ‘‘పుష్ప 2’’, ‘‘చావా’’ సినిమాలతో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న ఆమె.. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘‘సికిందర్‌’’లోనూ మెయిన్ లీడ్‌లో కనిపించబోతుంది. పైగా ఈ చిత్రాలలో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్‌తో మెప్పించింది. రివేంజ్ స్టోరీ, యాక్షన్, హిస్టారికల్ ఫిల్మ్‌లో తనదైన నటనతో పాన్ ఇండియా హీరోయిన్‌గా ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది.

గత 16 నెలల్లో రష్మిక హీరోయిన్‌గా వచ్చిన మూడు సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్నాయి. సమిష్టిగా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 3300 కోట్లకు పైగా వసూలు చేశాయి. ‘‘యానిమల్’’, ‘‘పుష్ప 2’’, ‘‘చావా’’ హిందీలో కలెక్షన్ రికార్డులను బద్దలు కొట్టాయి. ‘‘పుష్ప 2’’ హిందీలో రూ. 812 కోట్ల నికర వసూళ్లను సాధిస్తే.. యానిమల్ రూ. 503 కోట్లు, చావా ఇప్పటికే రూ.532 కోట్ల వసూళ్లు సాధించి థియాట్రికల్ రన్ కొనసాగిస్తోంది. మొత్తానికి రూ. 1850 కోట్ల ఈ క్యుమిలేటివ్ కలెక్షన్ రష్మికను అత్యధిక వసూళ్లు రాబట్టిన బాలీవుడ్ హీరోయిన్‌గా నిలబెట్టింది.

Read More..

"నా ప్రపంచాన్ని ప్రేమ, నవ్వు అన్ని రకాల ఆనందాలతో అలంకరించుకుంటున్నాను".. రష్మీ ఇంట్రెస్టింగ్ పోస్ట్

Next Story