- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rashmika Mandanna: హెల్త్ అప్డేట్ ఇచ్చిన రష్మిక మందన్న.. ఇకపై నిలబడలేనంటూ ఎమోషనల్ పోస్ట్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. ఇటీవల ‘పుష్ప-2’(Pushpa 2: The Rule) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చావా, కుబేర, ది గర్ల్‌ఫ్రెండ్(The Girlfriend) వంటి చిత్రాల్లో నటిస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ వరుస పోస్టులు షేర్ చేస్తోంది. అయితే ఇటీవల రష్మిక వర్కౌట్స్ చేస్తుండగా.. గాయం అయినట్లు తెలుపుతూ డైరెక్టర్స్‌కు క్షమాపణలు చెప్పింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే.
ఇటీవల ‘చావా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు కూడా కుంటుతూ వచ్చి చాలా ఇబ్బంది పడింది. అలాగే ఆమె వీల్ చైర్‌లో తిరుగుతూ కనిపించింది. తాజాగా, రష్మిక మందన్న సోషల్ మీడియా(Social Media) ద్వారా తన హెల్త్ అప్డేట్ ఇచ్చింది. ‘‘చావా’లో ఏసుభాయ్ పాత్రలో నటించడం గౌరవం. కృతజ్ఞతగా భావించాను. చావాలో ఏసుబాయ్ ఎలా అయితే తన బాధను తన ప్రజలకు చూపించదో అలా నేను కూడా లోలోపల కుమిలిపోతున్నా. ఎప్పటిలాగే అంతా నవ్వుతూ ఉంటాను. అమ్మాయిలు బయటికి చాలా అందంగా కనిపిస్తారు కానీ.. లోలోపల బాధ అలాగే ఉంటుంది.
కాలికి మూడు ఫ్రాక్చర్లు(Fractures) ఉన్నాయి. కండరాలు చినిగేంత గాయమైంది. 2 వారాలుగా నా కాలు దించలేదు. నేను నా సొంత కాళ్లపై నిలబడటం మిస్ అయ్యాను. దయచేసి మిమ్మల్ని మీరు బాగా చూసుకోండి. ప్రజలు మీతో అలా చెప్పినప్పుడు తేలికగా తీసుకోకండి..!! నేను మీకు అన్ని ప్రేమ, శక్తిని పంపుతున్నాను. మీ ప్రేమను, బలాన్ని నేను చాలా ప్రేమగా స్వీకరించాను. మీ అందరికీ బిగ్గెస్ట్ కౌగిలింతలు’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా తన కాలుకి సిటీ స్కాన్ చేయించినట్లు తెలుపుతూ ఫ్రాక్చర్ అయిన ఫొటోల(Photos)ను షేర్ చేసింది. ప్రస్తుతం రష్మిక పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన వారు త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.






