మరీ ఇంత ఘోరమా..? నోరు జారిన రష్మిక.. ట్రోల్స్ చేస్తున్న ప్రజలు

by Chukka Sudharani |   (  Updated:2025-02-15 12:33:04  IST  )

‘పుష్ప’(Pusha), ‘పుష్ప-2’(Pusha-2) చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్ గుర్తింపు తెచ్చుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రజెంట్ వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ సందడి చేస్తుంది.

మరీ ఇంత ఘోరమా..? నోరు జారిన రష్మిక.. ట్రోల్స్ చేస్తున్న ప్రజలు
X

దిశ, సినిమా: ‘పుష్ప’(Pusha), ‘పుష్ప-2’(Pusha-2) చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్ గుర్తింపు తెచ్చుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రజెంట్ వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ సందడి చేస్తుంది. ఈ బ్యూటీ నటించిన లేటెస్ట్ బాలీవుడ్ చిత్రం ‘ఛావా’(Chava). విక్కీ కౌశల్ (Vicky Kaushal) హీరోగా, లక్ష్మణ్ ఉటేకర్ (Director Laxman Utekar)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం లవర్స్ డే స్పెషల్‌గా ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకుంది. అంతే కాకుండా.. భారీ కలెక్షన్లు రాబడుతూ సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అయితే.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రష్మిక చేసిన కామెంట్స్ ప్రజెంట్ ట్రోల్స్‌కు గురవుతున్నాయి.

రష్మిక మాట్లాడుతూ.. ‘నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అయినా కూడా ముంబై ప్రేక్షకుల నా మీదా చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తేంటే సంతోషంగా ఉంది’ అంటూ కామెంట్ చేసింది. అయితే.. దీనిపై రియాక్ట్ అయిన కన్నడ ప్రజలు.. ‘రష్మిక ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చిందో అప్పుడే మర్చిపోయిందా.. కర్ణాటక(Karnataka)లోని కొడగు జిల్లా(Kodagu District) విరాజ్ పేట్(Virajpet) (రష్మిక సొంత ఊరు) హైదరాబాద్‌కు ఎప్పుడు షిప్ట్ అయింది’ ఫైర్ అవుతూ ట్రోల్స్ చేస్తున్నారు. మరి దీనిపై రష్మిక ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాల్సి ఉంది.

Next Story