విజ‌య్-ర‌ష్మిక పెళ్లి...ఘోరంగా అవ‌మానించిన‌ రిష‌బ్ శెట్టి ?

by velandi.Saikiran |   (  Updated:2026-02-27 02:05:58  IST  )

రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ పెళ్లిపై రిషబ్ శెట్టి స్పందించ‌డానికి నిరాక‌రించి, అవ‌మానించారు.

విజ‌య్-ర‌ష్మిక పెళ్లి...ఘోరంగా అవ‌మానించిన‌ రిష‌బ్ శెట్టి ?
X

దిశ‌, వెబ్ డెస్క్: విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda), హీరోయిన్ రష్మిక ( Rashmika Mandanna) వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. గురువారం ఉదయం 10 గంటల సమయంలో రష్మిక మెడలో మూడు ముళ్ళు వేశాడు విజయ్ దేవరకొండ. రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ఈ జంట పెళ్లి చేసుకుంది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి సినీ సెలబ్రిటీలు కూడా హాజరైనట్లు సమాచారం. ఇక మార్చి 4వ తేదీన విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది. ఈ కార్యక్రమం హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు.

రష్మిక వివాహంపై కన్నడ హీరో రియాక్షన్

విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి గురించే గత నాలుగు రోజుల నుంచి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీకి వచ్చిన కన్నడ హీరో రిషబ్ శెట్టి ( Rishab shetty), చేసిన పని హాట్ టాపిక్ అయింది. ఓ ఇంటర్వ్యూలో ఆయన పాల్గొనగా.. విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లిపై ప్రశ్నలు అడిగారు విలేకరులు. అయితే ఈ పెళ్లిపై స్పందించడానికి ఏమాత్రం ఇష్టం చూపించలేదట రిషబ్ శెట్టి. వెంటనే ఆ ఇంటర్వ్యూ నుంచి వెళ్లిపోయాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది. కాగా రష్మిక, రక్షిత్ శెట్టి ( Rakshit Shetty) ఎంగేజ్మెంట్ రద్దయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగిన చాలా రోజుల తర్వాత, లేటెస్ట్ గా విజయ్ ని పెళ్లి చేసుకుంది రష్మిక. అయితే రక్షిత్ శెట్టి చిన్ననాటి స్నేహితుడే రిషబ్ శెట్టి. అందుకే రష్మిక వివాహం పై అతడు స్పందించలేదని టాక్ నడుస్తోంది.

Virosh: అన్నా, వదినతో టాలీవుడ్ హీరో..క్యూట్ ఫోటోలు వైర‌ల్‌

Next Story