- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రష్మిక మందన్న, అక్కినేని హీరో క్యూట్ పిక్స్.. సూపర్ అంటూ కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) నటిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’.

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) నటిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున(Nagarjuna), రష్మిక మందన్న (Rashmika Mandanna) కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దీంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో జూన్ 20న ఈ చిత్రం విడుదల కాబోతోంది.
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ‘కుబేర’(Kubera) జూన్ 20న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించారు మూవీ టీమ్. అయితే ఈ ఈవెంట్‌లో రష్మిక మందన్న, నాగార్జున స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించారు. ట్రెడిషనల్ వేర్‌లో రష్మిక, బ్లూ అండ్ వైట్ ఫార్మల్‌లో నాగ్ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.






