చెప్పిందొకటి.. చేసిందొకటి.. డైరెక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన రష్మిక

by Sujitha Rachapalli |   (  Updated:2026-01-19 11:23:36  IST  )

సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘సికిందర్’. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన సినిమాలో వెంకీ కీలకపాత్రలో కనిపించాడు.

చెప్పిందొకటి.. చేసిందొకటి.. డైరెక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన రష్మిక
X

దిశ, సినిమా : సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘సికిందర్’. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన సినిమాలో వెంకీ కీలకపాత్రలో కనిపించాడు. కానీ ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. దీనిపై తాజాగా స్పందించిన రష్మిక.. చాలా ఓపెన్‌గా మాట్లాడింది. ‘సినిమా కోసం మురగదాస్ సార్ చెప్పిన స్క్రిప్ట్ (narration)తో ఫైనల్‌గా షూట్ అయిన సినిమా చాలా తేడా వచ్చింది. మురగదాస్ సార్‌ నరేషన్‌కు... ఆ తర్వాత వచ్చిన అవుట్‌పుట్‌కు చాలా తేడా ఉంది. నేను విన్న స్క్రిప్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంది’ అని తెలిపింది. అయితే ఇలాంటి మార్పులు సినిమాల్లో సాధారణమే అని.. షూటింగ్ సమయంలో పెర్ఫార్మెన్స్‌లు.. ఎడిటింగ్.. రిలీజ్ టైమింగ్ వంటి కారణాల వల్ల స్టోరీ మారిపోతుందని వివరించింది. కాగా ఈ చిత్రంలో రష్మిక పాత్ర ఫస్ట్ హాఫ్‌లోనే ఎండ్ కావడం విశేషం. ఇక తాజాగా రష్మిక చేసిన ఈ కామెంట్స్ తర్వాత సోషల్ మీడియాలో చాలా డిస్కషన్ జరుగుతోంది. డైరెక్టర్‌ను, హీరోను భలే బుక్ చేసిందంటున్నారు జనాలు.

Next Story