- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rashmika Mandanna: నా కొత్త ఏడాది గాయంతో మొదలైంది.. బెడ్‌పై రష్మిక మందన.. వైరల్‌గా మారిన పోస్ట్
నేను రాబోయే కొన్ని వారాలు లేదా నెలలు రెస్ట్ మోడ్‌లోనే ఉండాల్సి వస్తుంది..

దిశ, వెబ్ డెస్క్ : హీరోయిన్ రష్మిక మందన ( Rashmika Mandanna ) ప్రస్తుతంఫుల్ బిజీగా ఉన్న విషయం మనకీ తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా మొత్తం కవర్ చేస్తుంది. అయితే, రష్మిక స్పీడ్ కు దేవుడు బ్రేక్ వేసాడు. జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్న సమయంలో రష్మిక కాలుకి గాయం అయినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే రష్మిక సోషల్ మీడియా వేదికగా తన కాలుకి గాయమైనట్టుగా ఫొటోలను షేర్ చేసింది.
యానిమల్, పుష్ప 2 తో పెద్ద విజయం సాధించి నేషనల్ వైడ్‌గా రష్మిక పాపులారిటీని సంపాదించింది. బాలీవుడ్ కూడా రష్మికకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడు, సల్మాన్ ఖాన్ సికందర్ మూవీలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో కుబేర, గర్ల్ ఫ్రెండ్ అనే కొత్త మూవీస్ ను చేస్తోంది. కాలికి గాయమైన కారణంగా రష్మిక బెడ్ రెస్ట్ లో ఉంది.
"ఇదే నాకు హ్యాపీ న్యూ ఇయర్.. పవిత్రమైన జిమ్ మందిరంలో గాయపడ్డాను. ఇప్పుడు నేను రాబోయే కొన్ని వారాలు లేదా నెలలు రెస్ట్ మోడ్‌లోనే ఉండాల్సి వస్తుంది.. నా గాయాల నుంచి కోలుకున్న తర్వాత నేను తామ, సికందర్, కుబేరుల సెట్‌లకు తిరిగి వెళ్తాను. ఇలా ఆలస్యం అవుతున్నందుకు నా దర్శకులు నన్ను క్షమించండి.. నా లెగ్ యాక్షన్‌కు ఎప్పుడు మంచిగా ఉంటుందో.. అప్పుడు తిరిగి వస్తాను" అంటూ ఈ ముద్దుగుమ్మ ఇంస్టాగ్రామ్ వేదికగా ఫోటోలను షేర్ చేసింది. దీనిపై రియాక్ట్ అయిన ఫ్యాన్స్ " నీకేం కాదు..నువ్వు తొందరగా కోలుకుంటావు ..ధైర్యంగా ఉండు " అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






