- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహేష్ బాబు ఏజ్ పై రష్మిక హాట్ కామెంట్స్ !
ప్రిన్స్ మహేష్ బాబు వయసుపై ఆమె స్పందించారు. మహేష్ బాబు ఇప్పటికీ యంగ్ హీరోలా కనిపిస్తాడని తెలిపారు. ఆయన వయస్సు

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గీత గోవిందం సినిమాతో బాగా పాపులర్ అయిన ఈ బ్యూటీ, తెలుగులోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుసగా సినిమాలలో ఛాన్సులు దక్కించుకుంటున్నారు. అయితే అలాంటి రష్మిక ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా నవంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతోపాటు మరో నాలుగు భాషల్లో సినిమా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రిన్స్ మహేష్ బాబు వయసుపై ఆమె స్పందించారు. మహేష్ బాబు ఇప్పటికీ యంగ్ హీరోలా కనిపిస్తాడని తెలిపారు. ఆయన వయస్సు ఎప్పటికీ అయిపోదని, పైగా రోజురోజుకు ఆయన యంగ్ అవుతున్నారని కామెంట్స్ చేశారు. ఇదే అతనిలో తనకు ఇష్టమని, అసలు ఇది ఎలా సాధ్యమో తెలుసుకోవాలని నాకు ఉంది అని రష్మిక తెలిపారు. నాకంటూ కొంతమంది బెస్టీలు ఉన్నారు.. కానీ వాళ్ళ పేర్లు మాత్రం నేను చెప్పను అని వెల్లడించారు. అలా పేర్లు చెబితే నన్ను చంపేస్తారని బాంబు పేల్చారు. దీంతో రష్మిక కామెంట్స్ వైరల్ గా మారాయి.






