ఎట్టకేలకు విజయ్ పై ఉన్న లవ్‌ను అఫీషియల్‌గా ప్రకటించేసిన రష్మిక.. హార్ట్ సింబల్ జోడిస్తూ ఇంట్రెస్టింగ్ ట్వీట్

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ రూమర్ జంట విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna)ల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

ఎట్టకేలకు విజయ్ పై ఉన్న లవ్‌ను అఫీషియల్‌గా ప్రకటించేసిన రష్మిక.. హార్ట్ సింబల్ జోడిస్తూ ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ రూమర్ జంట విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna)ల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. 'గీత గోవిందం'(Geetha Govindam), 'డియర్ కామ్రేడ్'(Dear Comrade) వంటి సూపర్ హిట్ చిత్రాల్లో కలిసి నటించి, ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ జంట, నిజ జీవితంలోనూ కలిసే ఉంటున్నారనే వార్తలు తరచూ వస్తూనే ఉన్నాయి. అంతేకాదండోయ్ ఎన్నో సార్లు మీడియాకు చిక్కిన ఈ జంట రీసెంట్‌గా కూడా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రష్మిక ప్రయాణిస్తున్న కారులోనే విజయ్ దేవరకొండ ముందు సీటులో కూర్చుని కనిపించిన సంగతి తెలిసిందే.

దీంతో వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని కన్ఫార్మ్ అయిపోయారు. ఈ క్రమంలో రష్మిక చేసిన ట్వీట్‌తో మరింతగా కన్ఫర్మ్ అయిపోయారు. తాజాగా విజయ్ దేవరకొండ ‘కుబేర’ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన సందర్భంగా బెస్ట్ విషెస్ తెలుపుతూ పోస్టు పెట్టాడు. దీనికి రష్మిక తిరిగి రిప్లై ఇచ్చింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. ‘థాంక్యూ విజయ్ దేవరకొండ.. ఫింగర్ క్రాసెడ్’ అని హార్ట్ సింబల్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు హార్ట్ సింబల్‌తో అఫీషియల్‌గా లవ్‌ని కన్ఫర్మ్ చేసేశావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Twitter Link

Next Story