- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్కడ అతనితో బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్న రష్మిక..? నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు
పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఛలో’(Chalo) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. దీంతో వరుస అవకాశాలు తలుపు తట్టాయి. ఇక ‘పుష్ప’(Pushpa) మూవీతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అదే ఫేమ్‌తో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది.
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor) సరసన ‘యానిమల్’(Animal) సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అలాగే రీసెంట్‌గా సల్మాన్ ఖాన్(Salman Khan) సరసన ‘సికిందర్’(Sikindar) సినిమాలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
తాజాగా రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసుకుంది. అందులో గల్ఫ్ దేశాలలో ఒకటైన ఒమన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. అంతేకాదోండోయ్ తన బర్త్‌డే(April 05) సెలబ్రేషన్స్ కూడా అక్కడే జరుపుకుంటుంన్నదట. అయితే ఈ వేడుకలకు నేషనల్ క్రష్ ఫ్రెండ్స్‌తో పాటు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కూడా పాల్గొంటున్నాడట. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో కోడై కూస్తోంది. కాగా విజయ్, రష్మికలు ఎప్పటినుంచో డేటింగ్‌లో ఉన్నారనే పుకార్లు నెట్టింట షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే.
Read More..






