Rashmika: ‘ఇది నా పుట్టిన రోజు మాసం చాలా ఉత్సాహంగా ఉన్నానంటూ రష్మిక పోస్ట్’.. ఎన్ని సంవత్సరాల్లోకి అడుగుపెట్టనుందో తెలుసా?

by Kodari Anjali |   (  Updated:2025-04-02 06:07:26  IST  )

నేషనల్ క్రష్ రష్మిక మందన్న (National Crush Rashmika Mandanna) ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

Rashmika: ‘ఇది నా పుట్టిన రోజు మాసం చాలా ఉత్సాహంగా ఉన్నానంటూ రష్మిక పోస్ట్’.. ఎన్ని సంవత్సరాల్లోకి అడుగుపెట్టనుందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ క్రష్ రష్మిక మందన్న (National Crush Rashmika Mandanna) ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ బ్యూటీ పుష్ప (Pushpa), యానిమల్ (Animal) వంటి చిత్రాలతో డబుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. (Sukumar) దర్శకత్వం వహించిన పుష్ప రెండు భాగాల్లో (Icon Star Allu Arjun) సరసన నటించి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది.

రీసెంట్‌గా రష్మిక మందన్న అద్భుతమైన చిత్రం ఛావాలో నటించి.. తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇకపోతే ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికన తరచూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్‌తో అభిమానుల్ని అలరిస్తూ ఉంటుంది. తాజాగా రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ ఇది నా పుట్టిన రోజు మాసం. కాగా నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను.

చాలా మంది పెద్దాయ్యాక.. పుట్టినరోజును జరుపుకోవడంలో ఆసక్తిని కోల్పోతారని అంటారు. ఇది నేను ఎప్పటినుంచో వింటూనే ఉంటాను. కానీ నా విషయంలో అలా మాత్రం కాదు. పెద్దయ్యాక కూడా పుట్టినరోజును జరుపుకోవడానికి నేను మరింత ఉత్సాహం చూపిస్తాను. నాకు 29 ఏళ్లు వస్తున్నాయంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు జరుపుకోబోతున్న ఈ పుట్టిన రోజు నాకెంతో విలువైనది’’. అంటూ రష్మిక పోస్ట్ లో రాసుకొచ్చింది.

Next Story