- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయ్ దేవరకొండతో ప్రేమ.. మొత్తానికి ఓపెన్‌గానే ఒప్పుకున్న రష్మిక.. కుబేర ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో ఇదే హైలెట్(వీడియో)
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న కుబేర సినిమా ఇప్పటికే అంచనాలు పెంచేసింది. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్న మూవీ ఈ నెల 20న రిలీజ్ కాబోతుండగా..

దిశ, ఫీచర్స్ : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న కుబేర సినిమా ఇప్పటికే అంచనాలు పెంచేసింది. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్న మూవీ ఈ నెల 20న రిలీజ్ కాబోతుండగా.. ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ తరానికి డబ్బు విలువ గురించి చెప్పిన నటీనటులు.. మూవీ ఎలా ఉండబోతుందో చెప్తూ హైప్ పెంచేశారు. ఈ సినిమాను సరస్వతీ దేవి తల ఎత్తుకుని చూస్తుందంటూ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో చెప్పాడు దర్శకుడు.
ఇక యాంకర్ సుమ.. ఇతరుల నుంచి చోరీ చేయాలంటే ఏం చోరీ చేస్తారని రష్మికను అడగ్గా.. ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది బ్యూటీ. నాగార్జున నుంచి బ్యూటీ అండ్ ఆరా, ధనుష్ నుంచి ఎండలో పనిచేసే తత్వం, అల్లు అర్జున్ నుంచి స్టైల్ అండ్ స్వాగ్ చోరీ చేస్తానని చెప్పింది. మరి విజయ్ దేవరకొండ నుంచి ఏం దొంగతనం చేస్తావని ప్రశ్నించగా.. అన్నీ అని చెప్పేసింది. ఇక ఈ ఆన్సర్ విన్న విజయ్-రష్మిక అభిమానులు మొత్తానికి ఓపెన్‌గా ఒప్పేసుకుందని మురిసిపోతున్నారు.






