‘అదృష్టం కొందరికి అనుకూలంగా ఉంటుంది’.. రష్మి పోస్ట్ వెనక అర్థమేంటి..?

by Kodari Anjali |

2002లో సవ్వడి అనే చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించింది యాంకర్ రష్మి గౌతమ్.

‘అదృష్టం కొందరికి అనుకూలంగా ఉంటుంది’.. రష్మి పోస్ట్ వెనక అర్థమేంటి..?
X

దిశ, వెబ్‌డెస్క్: 2002లో సవ్వడి అనే చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించింది యాంకర్ రష్మి గౌతమ్. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల కాలేదు. తర్వాత ఉదయ్ కిరణ్ కథానాయకుడిగా నటించిన హోలీ మూవీలో సహాయ పాత్ర పోషించింది. తర్వాత యువ అనే సీరియల్‌లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది.

2010లో తెలుగులో వచ్చిన ప్రస్థానం చిత్రంలో రష్మి సైడ్ క్యారెక్టర్ పాత్ర చేసింది. అనంతరం ఒక రియాలిటీ డ్యాన్స్ షోలో రష్మి డ్యాన్స్ చూసిన నటి సంగీత కందెన్ సినిమాకి అవకాశం ఇప్పించింది. అలా కందెన్ చిత్రంలో నర్మద అనే ప్రధాన పాత్రను రష్మి పోషించింది. 2011లో తమిళ వచ్చిన కందెన్ అనే శృంగార చిత్రంలో నటించి.. తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది.

వీటితో పాటుగా ఈ అమ్మడు కరెంట్, గణేష్, వెల్ డన్ అబ్బా, చలాకీ, బిందాస్, లాగిన్, గురు, మాప్పిల వినాయగర్, ప్రియముదన్ ప్రియ, దౌలత్, బస్తీ, వ్యూహం, చారుశీల, గుంటూర్ టాకీస్, రాణి గారి బంగళా, అంతం, తను వచ్చెనంట, శివరంజని, బొమ్మ బ్లాక్ బస్టర్, బాయ్స్ హాస్టర్ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

ఇకపోతే ఈ యాంకర్ తాజాగా సోసల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘మరొక రోజు అవసరం లేని మరో కథ అదృష్టం కొందరికి అనుకూలంగా ఉంటుంది. దయచేసి పెంపుడు జంతువులను కొనకండి లేదా బహుమతిగా ఇవ్వకండి. పెంపుడు జంతువులు కనీసం 15 సంవత్సరాల ఆర్థిక, భావోద్వేగ నిబద్ధత. మీకు ఖచ్చితంగా అనిపిస్తే దయచేసి స్వీకరించండి #adoptdontshop పెంపుడు జంతువులు కుటుంబం’ అంటూ రాసుకొచ్చింది.instagram link

Next Story