rashikhanna: ఆత్మకు కాస్త విశ్రాంతి ఇవ్వండంటూ మెగా హీరోయిన్ పోస్ట్

by Kodari Anjali |

టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

rashikhanna: ఆత్మకు కాస్త విశ్రాంతి ఇవ్వండంటూ మెగా హీరోయిన్ పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ కెరీర్ స్టార్టింగ్లో మంచి అవకాశాలు దక్కించుకుని.. ఉత్తమ నటిగా పేరు సంపాదించుకుంది. ఊహాలు గుసగుసలాడే చిత్రంలో తెలుగు పరిశ్రమలో తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే ఈ బ్యూటీ బ్లాక్ బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. తర్వాత ఈ ముద్దుగుమ్మ అగ్ర హీరోల సరసన అవకాశం కొట్టేసింది.

బెంగాల్ టైగర్, జోరు, శివం, సుప్రీమ్, హైపర్, రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు, తొలిప్రేమ, శైత్కానీ ఇమైక్కా నొడిగల్, అడంగా మారు, వెంకీ మామ, శ్రీనివాస కళ్యాణం వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్ వంటి తెలుగు, తమిళ్, మలయాళం సినిమాల్లో నటించి.. తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది. తాగే తమిళ్లో అరణ్మణై అనే సినిమాలో నటించి.. మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కెరీర్ ప్రారంభంలోనే కన్నా ఇప్పుడు రాశీ ఖన్నాకు సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియా వేదికన ఓ పోస్ట్ పెట్టింది.

‘‘శరీరానికి ఆహారం పెట్టండి.. సూర్యుడిని పట్టుకోండి. అలాగే ఆత్మకు కూడా కొంచెం విశ్రాంతి ఇవ్వండి. సందడిగల నగరాల్లో మృదువైన క్షణాలు ఇవి’’ అంటూ రాశి ఖన్నా పోస్ట్‌కు ఓ క్యాప్షన్ జోడించి బ్యూటిపుల్ ఫొటోలు పంచుకుంది.

Next Story