- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్షయ్ కుమార్‌కు జోడీగా పవన్ కళ్యాణ్ హీరోయిన్..
* ఇండస్ట్రీలో కొత్త జోడీ అలర్ట్ * బాలీవుడ్ స్టార్‌కు జోడీగా పవన్ కళ్యాణ్ హీరోయిన్ * సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కామెంట్స్

X
దిశ, సినిమా : ఇండస్ట్రీలో కొత్త జోడీ అలర్ట్ వచ్చేసింది. ఖిలాడీ అక్షయ్ కుమార్‌తో బ్యూటిఫుల్ రాశీ ఖన్నా జోడీగా నటించబోతుంది. అనీస్ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామాలో విద్యా బాలన్ కూడా ముఖ్యపాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. ‘వెల్‌కమ్’, ‘సింగ్ ఈజ్ కింగ్’, ‘థాంక్ యూ’ తర్వాత అక్షయ్ కుమార్, అనీస్ బజ్మీ కాంబోలో రాబోతున్న ఈ నాలుగో ప్రాజెక్ట్ షూటింగ్ జనవరి 15 నుంచి ప్రారంభమవుతుందని ఇండస్ట్రీ టాక్. ఇక రాశీ ఖన్నా ‘మద్రాస్ కేఫ్’తో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అయితే ఇది అక్షయ్‌తో ఆమె మొదటి సినిమా. కాగా ఈ కాంబినేషన్ చూడడానికి కొత్తగా, ఆసక్తికరంగా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక రాశీ ఖన్నా రీసెంట్‌గా ‘తెలుసు కదా’ సినిమాతో ప్రేక్షకుల మనసు దోచేయగా.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
Next Story






