Rashi Khanna: బ్యాక్ అందాలతో అభిమానులను ఆకట్టుకుంటున్న రాశి ఖన్నా

by Pulgam srinivas |

రాశి ఖన్నా తాజాగా అల్ట్రా స్టైలిష్ లుక్ కలిగిన డ్రెస్ ధరించి, తన బ్యాక్ అందాలు హైలైట్ అయ్యేలా అద్భుతంగా పోజులు ఇచ్చింది.

Rashi Khanna: బ్యాక్ అందాలతో అభిమానులను ఆకట్టుకుంటున్న రాశి ఖన్నా
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్న అందాల భామ రాశి ఖన్నా ప్రస్తుతం మూడు భాషల్లోనూ వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది.




కెరియర్ ప్రారంభం నుంచే తన అందమైన నటనతో పాటు ఆకట్టుకునే గ్లామర్‌తో ప్రేక్షకుల మనసు దోచుకుంటూ వస్తున్న ఈ బ్యూటీ, ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటోంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా రాశి ఖన్నా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది.




ముఖ్యంగా అప్పుడప్పుడు షేర్ చేసే హాట్ అండ్ గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వైరల్ అవుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసిన అనేక ఫోటోలు గతంలో ట్రెండింగ్‌గా మారిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా ఈ హీరోయిన్‌కు సంబంధించిన కొన్ని స్టైలిష్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.



ఆ ఫోటోలలో రాశి ఖన్నా అల్ట్రా స్టైలిష్ లుక్ కలిగిన డ్రెస్ ధరించి, తన బ్యాక్ అందాలు హైలైట్ అయ్యేలా అద్భుతంగా పోజులు ఇచ్చింది. చేతిలో చిన్న స్టైలిష్ బ్యాగ్ పట్టుకుని, కిల్లింగ్ లుక్స్‌తో ఫ్రంట్, బ్యాక్, సైడ్ యాంగిల్స్‌లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చి అభిమానులను ఆకట్టుకుంది.




అలాగే ఈమె చెవులకు ధరించిన పెద్దపెద్ద ఇయర్ రింగ్స్ ఆమె అందాన్ని మరింత హైలైట్ చేసాయి. ముఖ్యంగా ఈ ఫోటోలలో ఎక్కువగా తన బ్యాక్, నడుము అందాలు స్పష్టంగా కనిపించేలా ఇచ్చిన స్టిల్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దాంతో రాశి ఖన్నా తాజా స్టైలిష్ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story