- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RashaThadani: హిట్ సినిమాకు సీక్వెల్.. శ్రీలీలను తీసేసి మరో యంగ్ బ్యూటీకి ఆఫర్
ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న హీరోయిన్స్‌లో యంగ్ బ్యూటీ రాషా థడాని (RashaThadani) ఒకరు

దిశ, సినిమా: ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న హీరోయిన్స్‌లో యంగ్ బ్యూటీ రాషా థడాని (RashaThadani) ఒకరు. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ (Raveena Tandon) కుమార్తె అయిన రాషా.. తన తల్లి వారసత్వంగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అభిషేక్ కపూర్ (Abhishek Kapoor) దర్శకత్వంలో అజయ్ దేవగన్ (Ajay Devgan) మేనల్లుడు అమన్ దేవగన్‌తో కలిసి ‘ఆజాద్’ చిత్రంలో నటించింది. ఈ సినిమా బాలీవుడ్(Bollywood)లో హిట్ అందుకోవడంతో.. రాషా క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అంతే కాకుండా తన అందం, అభినయంతో తల్లిని మించిన గ్లామరస్ బ్యూటీగా ప్రజెంట్ వరుస అవకశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ మరో బంపర్ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది.
‘పతి పత్ని ఔర్ వో’ సినిమా 2019లో వచ్చి బాలీవుడ్‌లో మంచి సక్సెస్ అందుకుంది. ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భూమీ పడ్నేకర్, అనన్య పాండే, కార్తీక్ ఆర్యన్, రాజ్పాల్ యాదవ్, అపర్ శక్తి ఖురానా, కృతి సనన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుండగా.. ఇందులో కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) హీరో కాగా.. మొదట టాలీవుడ్ యంగ్ బ్యూటీని శ్రీలీల (Sreeleela)ను హీరోయిన్‌గా తీసుకున్నారు. కానీ, ఇప్పుడు శ్రీలీలను తీసేసి కార్తీక్ ఆర్యన్ సరసర రాషా థడానిని ఫిక్స్ చేశారట మేకర్స్. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ కావడంతో.. శ్రీలీలకు పోటీగా రాషా దిగిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.






