Keerthy Suresh: నటి కీర్తి సురేశ్‌కు అరుదైన గౌరవం..

by Ramesh Naini |

ప్రముఖ నటి కీర్తి సురేశ్‌కు అరుదైన గౌరవం లభించింది.

Keerthy Suresh: నటి కీర్తి సురేశ్‌కు అరుదైన గౌరవం..
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ నటి కీర్తి సురేశ్‌(Keerthy Suresh)కు అరుదైన గౌరవం లభించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన యూనిసెఫ్ (యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్) ఇండియా విభాగానికి సెలబ్రిటీ అడ్వకేట్‌గా కీర్తి సురేశ్ నియమితులయ్యారు. పిల్లల మానసిక ఆరోగ్యం, హక్కుల గురించి ఆమె పనిచేయనున్నారని (UNICEF India) యునిసెఫ్‌ ఇండియా ప్రతినిధి సింథియా మెక్‌కాఫ్రీ తాజాగా ప్రకటించారు.

యునిసెఫ్‌ ఇండియా సెలబ్రిటీ ప్రచారకర్తగా కొత్త బాధ్యతలు చేపట్టడంపై కీర్తి సురేశ్ స్పందించింది. ఇది తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు హర్షం వ్యక్తం చేసింది. పిల్లల శ్రేయస్సు మన బాధ్యత అని, వారి పెంపకం, సంరక్షణ, నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి పునాది వేస్తోందని, యూనిసెఫ్ ఇండియాతో చేతులు కలపడం తనకు గౌరవంగా ఉందని పేర్కొన్నారు. మరోవైపు కీర్తితో భాగస్వామ్యంపై యూనిసెఫ్ ఇండియా హర్షం వ్యక్తం చేసింది.

Next Story