- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RAPO23: ‘వీర’గా కనిపించనున్న రామ్ పోతినేని
రామ్ పోతినేని తన తదుపరి చిత్రంలో ‘వీర’ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన తదుపరి చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనను తాజాగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు టైటిల్ ఖరారు కాకపోవడంతో ‘RAPO23’ అనే వర్కింగ్ టైటిల్‌తో మూవీని ప్రకటించారు. ఈ చిత్రానికి కథను స్వయంగా రామ్ పోతినేని అందించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రాన్ని కృష్ణ పోతినేని నిర్మించనుండగా, 2026 డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమాలో రామ్ ‘వీర’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో రామ్ వెనుక భాగం మాత్రమే కనిపించేలా డిజైన్ చేయడం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచింది. దీంతో త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్‌కు సంబంధించిన మరో అప్డేట్‌ను మేకర్స్ విడుదల చేసే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






