Pushpa-2: సుకుమార్‌పై రాప్ సాంగ్.. పవన్ మ్యూజిక్.. చరణ్ ఆలపించిన పాట వైరల్

by Kodari Anjali |   (  Updated:2025-08-02 08:49:16  IST  )

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Pushpa-2: సుకుమార్‌పై రాప్ సాంగ్.. పవన్ మ్యూజిక్.. చరణ్ ఆలపించిన పాట వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్(Sukumar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి.. తనలోని టాలెంట్‌ను బయటపెడుతున్నారు. ముఖ్యంగా రీసెంట్‌గా థియేటర్లలో విడుదలైన పుష్ప-2 (Pushpa) గురించైతే స్పెషల్ గా చెప్పనవసరం లేదనుకోండి. ఈ మూవీలోని ఫైట్స్, యాక్టింగ్, ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకునే పాటలు.. ఇలా ప్రతి ఒక్కటి హైలెట్‌గా నిలిచాయి. రిలీజైన తొలిరోజే భారీ వసూళ్లు కొల్లగొట్టింది. పుష్ప సినిమాలతో సుకుమార్ క్రేజ్ డబుల్ అయ్యింది. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో పుష్ప-2 దూసుకుపోతుంది.

అయితే తాజాగా ఈ బ్లాక్ బస్టర్ సినిమాకు దర్శకత్వం వహించిన సుకుమార్‌పై రాప్ సాంగ్(Rap song) చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాటను అద్విత్ రెడ్డి(Advith Reddy) ప్రజెంట్ చేయగా.. చరణ్(Charan) ఆలపించారు. అలాగే పవన్(Pawan) సంగీతాన్ని సమకూర్చారు. ఈ పాటలో సుకుమార్ టాలెంట్‌ను చూపించారు. ఈ వీడియో ద్వారా సుక్కు గొప్పతనాన్ని చూపిస్తూ.. ఆయన కంటెంట్ బలాన్ని హైలెట్ చేశారు. ఈ పాటలో సాగిన సుకుమార్ సార్ మీరు ఒక మాన్ స్టర్ అని రాసుకున్న లైన్స్ కూడా అదిరిపోయాయి. సుకుమార్‌కు అంకితం చేస్తూ ప్రెజెంట్ చేసి ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Read More...

Allu Arjun: దేశంలో ఏ హీరో టచ్ చేయలేని రికార్డు సాధించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Next Story