'రావ్ బహదూర్' సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ లాక్

by Pulgam srinivas |

'రావ్ బహదూర్' చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా నిడివి 169 నిమిషాల 40 సెకన్లుగా ఖరారైంది.

రావ్ బహదూర్ సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ లాక్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన 'రావ్ బహదూర్' చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ చిత్రానికి వెంకటేష్ మహా దర్శకత్వం వహించగా, జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా నిడివి 169 నిమిషాల 40 సెకన్లుగా ఖరారైంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌తో పాటు ఇతర ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ చిత్రంలో దీపా థామస్, వికాస్ ముప్పాల కీలక పాత్రలు పోషించగా, స్మరణ్ సాయి సంగీతం అందించారు. ఈ సినిమాను అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, గోపాలకృష్ణ రెడ్డి నిర్మించగా, GMB ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ సమర్పిస్తున్నారు.


Next Story