మెక్ డొనాల్డ్స్ బ్రాండ్ అంబాసిడర్ గా రణ్‌వీర్ సింగ్

by Naga Rani Yarlagadda |

ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ బ్రాండ్ మెక్‌డొనాల్డ్స్ ఇండియా (నార్త్ & ఈస్ట్) తమ కొత్త ప్రచారానికి బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా.. రణ్‌వీర్ ప్రత్యేకంగా రూపొందించిన 'రణ్‌వీ స్పెషల్ మీల్'ను సోమవారం ఆవిష్కరించారు.

మెక్ డొనాల్డ్స్ బ్రాండ్ అంబాసిడర్ గా రణ్‌వీర్ సింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ బ్రాండ్ మెక్‌డొనాల్డ్స్ ఇండియా (నార్త్ & ఈస్ట్) తమ కొత్త ప్రచారానికి బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా.. రణ్‌వీర్ ప్రత్యేకంగా రూపొందించిన 'రణ్‌వీ స్పెషల్ మీల్'ను సోమవారం ఆవిష్కరించారు.

ఈ మీల్‌లో రణ్‌వీర్‌కు ఇష్టమైన మెక్‌వెజ్ (ఎక్స్‌ప్లోడ్) లేదా మెక్‌చికెన్ (ఎక్స్‌ప్లోడ్) బర్గర్, గోల్డెన్ క్రిస్పీ ఫ్రైస్, కొత్తగా పరిచయం చేసిన బొబా బ్లాస్ట్ బీవరేజ్ ఉన్నాయి. క్రీమీ-స్పైసీ ఎక్స్‌ప్లోడ్ సాస్, క్రంచీ ఉల్లిపాయలతో కూడిన బర్గర్, బొబా పెరల్స్‌తో రుచికరమైన డ్రింక్ ఈ మీల్‌ను ప్రత్యేకంగా నిలిపాయి. జూన్ 13 నుంచి ఉత్తర, తూర్పు భారతదేశంలోని మెక్‌డొనల్డ్స్ రెస్టారెంట్లలో ఈ మీల్ పరిమిత కాలం పాటు లభిస్తుంది.

మెక్‌డొనాల్డ్స్ తమ ప్రపంచ వ్యాప్త 'ఫేమస్ ఆర్డర్స్' కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకొని ఈ మీల్‌ను తీర్చిదిద్దింది. ఈ ఘనతతో రణ్‌వీర్ సింగ్, బీటీఎస్, ట్రావిస్ స్కాట్ వంటి గ్లోబల్ సెలబ్రిటీల సరసన నిలిచారు. సీపీఆర్ఎల్ (మెక్‌డొనాల్డ్స్ ఇండియా- నార్త్ & ఈస్ట్) వైస్ ఛైర్‌పర్సన్ అనంత్ అగర్వాల్ మాట్లాడుతూ.. "రణ్‌వీర్ యొక్క ఉత్సాహం, మా బ్రాండ్ విలువల కలయిక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. ఇది అభిమానులతో మా అనుబంధాన్ని మరింత బలపరుస్తుంది." అని పేర్కొన్నారు.

రణ్‌వీర్ సింగ్ ఈ అవకాశంపై సంతోషం వ్యక్తం చేస్తూ, "మెక్‌డొనాల్డ్స్‌తో కలిసి పనిచేయడం, నా పేరుతో ఒక స్పెషల్ మీల్‌ను తీసుకురావడం గొప్ప గౌరవం. ఈ మీల్ నా అభిమానులకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని పంచుతుందని ఆశిస్తున్నాను." అని అన్నారు. 'రణ్‌వీ స్పెషల్ మీల్' వెజ్ ఆప్షన్ రూ.249, నాన్-వెజ్ ఆప్షన్ రూ. 269 నుంచి ప్రారంభమవుతుంది. దీనిని స్టోర్‌లలో, యాప్ ద్వారా, లేదా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆర్డర్ చేయవచ్చు.

Next Story