Rani Mukerji : 47 ఏళ్ల వయస్సు.. కుర్ర హీరోయిన్లకు తీసిపోని అందం సీక్రెట్ అదే

by Pulgam srinivas |

రాణి ముఖర్జీ మాట్లాడుతూ... నేను నా ముఖం మరియు వెంట్రుకలు అందంగా, ఆకర్షణీయంగా ఉండడం కోసం కేవలం కొబ్బరి నూనెను మాత్రమే ఉపయోగిస్తానని ఈ నటి చెప్పుకొచ్చింది.

Rani Mukerji : 47 ఏళ్ల వయస్సు.. కుర్ర హీరోయిన్లకు తీసిపోని అందం సీక్రెట్ అదే
X

దిశ, వెబ్ డెస్క్ : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా కొనసాగే ముద్దుగుమ్మలు అందంపై చాలా శ్రద్ధ వహిస్తూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం అందంగా ఉన్నట్లయితేనే వారికి అవకాశాలు వస్తూ ఉంటాయి. దానితో అందంగా కనిపించడం కోసం డైట్ పాటించడం మాత్రమే కాకుండా అనేక రకాలైన క్రీములను వాడుతుంటారు. ఒక ముద్దుగుమ్మ మాత్రం ఎలాంటి క్రీములు వాడకుండా సహజ సిద్ధంగా అందంగా ఉంది. 47 సంవత్సరాల వయసులోకి వచ్చినా కూడా కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చే రేంజ్ లో అందాలను మెయింటైన్ చేస్తుంది.

47 సంవత్సరాల వయసులో కూడా ఆమె అందంగా ఉండడంతో చాలామంది లక్షల్లో ఖర్చుపెట్టి విదేశాల నుండి ఎగుమతి చేసిన లోషన్స్, క్రీమ్స్ ఆమె వాడుతుంది కావచ్చు అని చాలామంది అనుకుంటారు. కానీ ఆమె అత్యంత సాధారణ స్త్రీలు వాడే కొబ్బరి నూనె వాడుతూ స్టార్ హీరోయిన్ల స్థాయి అందాలను మెయింటైన్ చేస్తుంది. ఇంతకు ఆమె ఎవరు అనుకుంటున్నారా..? ఆ బ్యూటీ మరెవరో కాదు రాణి ముఖర్జీ. ఈమె ఇప్పటివరకు ఎన్నో హిందీ సినిమాల్లో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది.

తాజాగా రాణి ముఖర్జీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో ఈమెకు మీ ముఖం ఎంతో గ్లో గా ఉంది, అలాగే వెంట్రుకలు కూడా సూపర్ గా ఉన్నాయి. మీరు ఈ రెండింటినీ మెయింటైన్ చేయడానికి ఎలాంటి పద్ధతులు వాడుతారు అనే ప్రశ్న ఎదురైంది. దానికి రాణి ముఖర్జీ సమాధానం చెబుతూ... చాలామంది నేను అందంగా కనిపించడం కోసం, నా వెంట్రుకలు ఆకర్షణీయంగా కనిపించడం కోసం చాలా ఖర్చు పెడతానని అనుకుంటారు. కానీ నేను వాటి కోసం పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టను. సహజసిద్ధంగా దొరికే కొబ్బరి నూనె వాటిపై అప్లై చేస్తాను. కొబ్బరి నూనె వల్లే నా మొహం మరియు వెంట్రుకలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని ఈనటి చెప్పుకొచ్చింది.

Next Story