- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయోధ్యలో స్థలం కొనుగోలు చేసిన బడా హీరో.. ఎన్ని కోట్లో తెలుసా..?
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రామ జన్మభూమి అయోధ్యలో హీరో రణ్ బీర్ కపూర్ ల్యాండ్ కొనుగోలు చేశాడు.

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ అగ్ర హీరో రణ్ బీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో బంపర్ హిట్ సినిమాలను చేసిన ఆయన.. కోట్లల్లో డబ్బులు కూడా సంపాదించాడు. ఈ క్రమంలోనే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రామ జన్మభూమి అయోధ్యలో హీరో రణ్ బీర్ కపూర్ ల్యాండ్ కొనుగోలు చేశాడు. సరయూ నది తీరంలోని ఓ వెంచర్ లో 2134 చదరపు అడుగుల ల్యాండ్ ను కొనుగోలు చేశాడు. దీని విలువ రూ.3.31 కోట్లుగా ఉంది. ఈ ల్యాండ్ కొనుగోలు చేసిన నేపథ్యంలో రణ్ బీర్ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అయోధ్య నన్ను ఎంచుకుందని... నేను వెంటనే ఓకే చెప్పినట్లు వెల్లడించారు రణ్ బీర్ కపూర్. మన చరిత్రలో ఈ ప్రాంతానికి ఎంతో ప్రాముఖ్యం ఉందని వ్యాఖ్యానించారు. ఈ భూమి తన కుటుంబం, వారసత్వంలో ఒక భాగం అయిందని పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా రామాయణ సినిమాలో రాముడిగా రణ్ బీర్ కపూర్ నటించనున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి సీతగా నటించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. అటు రావణాసురుడిగా కేజిఎఫ్ హీరో యష్ మెరువనున్నారు. సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దుబే లక్ష్మణుడి పాత్రలో కనిపించనున్నారు.






