- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sanjay Leela Bhansali: రణబీర్ కపూర్, అలియా భట్ మరో పాన్ ఇండియా మూవీ.. డైరెక్టర్ ఎవరంటే?
బాలీవుడ్ (Bollywood) స్టార్ అండ్ క్యూట్ కపుల్స్‌లో అలియా భట్ (Alia Bhatt), రణబీర్ కపూర్ (Ranbir Kapoor) జంట ఒకటి.

దిశ, సినిమా: బాలీవుడ్ (Bollywood) స్టార్ అండ్ క్యూట్ కపుల్స్‌లో అలియా భట్ (Alia Bhatt), రణబీర్ కపూర్ (Ranbir Kapoor) జంట ఒకటి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra) సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అలాగే ఈ చిత్రానికి పార్ట్-2 కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై రణబీర్ మాట్లాడుతూ.. అయాన్ ముఖర్జీ ప్రజెంట్ వార్-2తో బిజీగా ఉన్నాడు. అది అవ్వగానే ‘బ్రహ్మాస్త్ర-2’ ఖచ్చితంగా జరుగుతుందని తెలిపారు. దీంతో రణబీర్, అలియాను మరోసారి స్క్రీన్‌పై చూడొచ్చని సంతోషించారు ఫ్యాన్స్.
అయితే.. ఈ మూవీ కాకుండా అలియా, రణబీర్ కాంబోలో మరో పాన్ ఇండియా (Pan India) సినిమా రాబోతున్నట్లు ప్రజెంట్ బాలీవుడ్ సర్కిల్ నుంచి ఓ లెటెస్ట్ బజ్ వినిపిస్తోంది. అందుతున్న సమాచారం మేరకు.. ఈ భారీ ప్రాజెక్ట్‌కు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తుండగా.. రణబీర్ కపూర్, అలియాభట్‌తో పాటు విక్కీకౌషల్ (Vicky Kaushal) కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ మూవీ లవ్ & వార్ బ్యాక్ డ్రాప్‌లో రానుందట. అంతే కాకుండా.. మార్చి 20, 2026న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. ఇక ఇప్పటికే ‘యానిమల్’తో రణబీర్, ‘ఛావా’తో విక్కీ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడంతో.. వీరిద్దరి కాంబోలో మూవీ అంటే ప్రేక్షకుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి.
#SanjayLeelaBhansali is going Pan-India with Love & War, starring #RanbirKapoor, #AliaBhatt & #VickyKaushal! Set for a grand release on March 20, 2026! The film aims to capture hearts across regions. With the success of #Animal & #Chhaava, Ranbir & Vicky are already resonating… pic.twitter.com/iAQafHRXQ0
— Siddharth R Kannan (@sidkannan) April 5, 2025






