- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాముడిగా రణ్‌బీర్.. రావణుడిగా యశ్.. ఆకట్టుకుంటున్న రామాయణ ఫస్ట్ గ్లింప్స్
ప్రస్తుత భారతీయ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రం 'రామాయణ'.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత భారతీయ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రం 'రామాయణ (Ramayana)'. రాముడిగా బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ (Ranbir kapoor), సీతగా సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి (Sai pallavi) నటిస్తున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇక కన్నడ స్టార్ యశ్ ఇందులో రావణుడి పాత్రలో నటిస్తున్నారు. అలాగే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలోని పలువురు స్టార్స్ రామాయణ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భారతీయ ఇతిహసాల్లో ముఖ్యమైన రామాయణ గాథ ఆధారంగా డైరెక్టర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
అయితే, తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేశారు. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో వీఎఫ్ఎక్స్, బీజీఎమ్ ఆకట్టుకుంటున్నాయి. సినిమాలోని ప్రధాన పాత్రలను పరిచయం చేసే ఉద్దేశంతో ఈ తొలి వీడియోను విడుదల చేశారు. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీత దేవిగా సాయి పల్లవి లుక్స్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయగా.. 2027 దీపావళికి రెండో భాగాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు.






