- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రణబాలి మేకింగ్ వీడియో వచ్చేసింది.. ప్రాణాలను పణంగా పెట్టిన విజయ్ దేవరకొండ
రణబాలి మేకింగ్ వీడియో... రెండుసార్లు గుర్రం పడేసినా అస్సలు వెనుకంజ వేయని విజయ్ దేవరకొండ

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం రౌడీ జనార్ధన సినిమాతో పాటు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి అనే చిత్రంలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్న - విజయ్‌కు జోడిగా కనిపించనుండగా, మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు విజయ్ పుట్టినరోజు సందర్భంగా రణబాలి చిత్ర బృందం ఈ సినిమా నుండి ఓ మేకింగ్ వీడియోను విడుదల చేసింది. అందులో విజయ్ గుర్రంపై స్వారీ చేస్తున్న సన్నివేశాలు కనిపిస్తాయి. అయితే ఆ గుర్రంపై పర్ఫెక్ట్‌గా స్వారీ చేయడానికి ఆయన ఎంత ప్రమాదాన్ని ఎదుర్కొన్నాడో ఈ వీడియోలో చూపించారు.
ఈ మేకింగ్ వీడియో ప్రకారం దాదాపు రెండు సార్లు గుర్రం ఎక్కిన సమయంలో అది విజయ్‌ను కింద పడేసింది. దాంతో ఆయన గాయాల పాలయ్యాడు. అయినప్పటికీ పట్టు వదలకుండా అదే గుర్రంపై స్వారీ చేయాలనే దృఢ సంకల్పంతో తీవ్రంగా శ్రమించి చివరకు విజయవంతంగా దానిపై స్వారీ చేశాడు. ఈ మొత్తం ప్రాసెస్‌ను చూపిస్తూ చిత్ర బృందం విడుదల చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన అభిమానులు “డెడికేషన్ అంటే ఇదే” అంటూ విజయ్ దేవరకొండపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏదేమైనా ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది విజయ్ ధైర్యం, కష్టపడే తత్వానికి ఫిదా అవుతున్నారు.






