- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rana Daggubati: హాలీవుడ్ దిగ్గజాలతో రానా వీకెండ్ పార్టీ.. దానికి కారణం ఏంటంటే?
టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి(Rana Daggubati) ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు నిర్మాతగానూ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి(Rana Daggubati) ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు నిర్మాతగానూ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. అయినప్పటికీ వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా, ఆయన భార్యతో కలిసి అమెరికాకు వెళ్లాడు. అక్కడ మియామి గ్రాండ్ ప్రీక్స్ వీకెండ్ ఈవెంట్‌లో హాజరయ్యారు. ఈ వేడుకల్లో హాలీవుడ్ సంగీత దిగ్గజాలైన 50 సెంట్, ఆస్కార్ విజేత గూడింగ్ జూనియర్(Gooding Jr.)తో ముచ్చటించారు. లోకా లోకా(Loka loka) పార్టీ సంస్థ ఏర్పాటు చేసిన ఈవెంట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన రానా ఇందులో పాల్గొని సందడి చేశారు. ఆయనతో పాటు ఈ వేడుకలో అనిరుధ్ రవిచందర్, హర్ష వడ్లమూడి కూడా వెళ్లారు. అయితే అమెరికా మార్కెట్లో తమ సంస్థ విస్తరణ కోసమే ఆ పార్టీకి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వైట్ కలర్ డ్రెస్ ధరించిన రానా బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని స్లైలీష్ లుక్‌లో కనిపించారు. ఇక ఈ ఫొటోలను చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. లుక్ అదిరిపోయిందని కామెంట్లు చేస్తున్నారు. రానా అన్నా ఆల్ రౌండర్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.






