- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనంతపురంలో ‘రణబాలి’.. షూటింగ్‌లో పాల్గొన్న కొత్త జంట!
అనంతపురంలో జరుగుతున్న ‘రణబాలి’ షూటింగ్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జాయిన్ అయినట్లు తెలుస్తుంది.

దిశ, సినిమా: రీసెంట్‌గా పెళ్లి బంధంలోకి అడుగు పెట్టిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూనే సినిమా షూటింగ్‌లో కూడా జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘రణబలి’. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్ రణబాలిగా, రష్మిక జయమ్మ పాత్రల్లో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టేజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతుంది. ఈ క్రమంలోనే ఎంజాయ్మెంట్‌ను సైతం పక్కన పెట్టి ఈ జంట షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. ప్రజెంట్ ‘రణబాలి’ చిత్రీకరణ తాజా షెడ్యూల్ ఈ రోజు అనంతపురంలో ప్రారంభమైంది. ఏప్రిల్ మొదటి వారం వరకు చిత్రీకరణ కొనసాగుతుండగా ఇందులో రష్మిక, విజయ్‌పై సీన్స్ షూట్ చేయనున్నారు చిత్ర బృందం. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతుండగా.. పెళ్లైన నెలకే షూటింగ్‌లో పాల్గోన్నారు అంటే మీ డెడికేషన్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.






