రణబాలి మూవీ అనంతపూర్ షెడ్యూల్ కంప్లీట్.. ఫ్యాన్స్‌తో విజయ్ స్పెషల్ మీట్

by Chukka Sudharani |

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ‘రణబాలి’ అనంతపూర్ షెడ్యూల్ పూర్తి.

రణబాలి మూవీ అనంతపూర్ షెడ్యూల్ కంప్లీట్.. ఫ్యాన్స్‌తో విజయ్ స్పెషల్ మీట్
X

దిశ, సినిమా: విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రణబాలి’. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టును ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. హై ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య ఈ చిత్రం సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతున్నది. దీంతో చిత్రీకరణ‌లో స్పీడ్ పెంచిన చిత్ర బృందం.. గ్యాప్ లేకుండా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్నారు. ఈ టైమ్‌లో తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు.

ఈ సినిమా అనంతపూర్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుందని తెలిపారు. ఈ మేరకు అనంతపూర్‌లో షూటింగ్ సందర్భంగా అక్కడి స్థానికులు, రౌడీ ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంట మీద ఎంతో ప్రేమాభిమానాలు చూపించారు. అభిమానులు బైక్ ర్యాలీలతో విజయ్ పట్ల ప్రేమను చాటుకున్నారు. విజయ్ దేవరకొండ తన రాయలసీమ అభిమానులను ఫ్యాన్స్ మీట్‌‌లో కలుసుకున్నారు. రాయలసీమకు ఎప్పుడు షూటింగ్‌కు వచ్చినా తన సొంతూరుకు వచ్చినట్లు అనిపిస్తుందని, తనలోపల సీమ ఫీల్ ఉందని విజయ్ దేవరకొండ అన్నారు. ఇలా ఎన్నో ఎమోషనల్ మూవ్ మెంట్స్‌తో ‘రణబాలి’ అనంతపూర్ షెడ్యూల్ పూర్తయ్యిందని తెలిపారు. కాగా ఈ సినిమాలో రణబాలి అనే యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ, జయమ్మగా రశ్మిక మందన్న ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్నారు.

Next Story