Kaantha: దుల్కర్ సల్మాన్ ‘కాంత’లో మరో స్టార్ హీరో..

by Chukka Sudharani |

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘కాంత’.

Kaantha: దుల్కర్ సల్మాన్ ‘కాంత’లో మరో స్టార్ హీరో..
X

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘కాంత’ (Kaantha). 1950 మద్రాసులో జరిగిన ఒక ఉత్కంఠభరితమైన నాటకీయ థ్రిల్లర్‌గా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లో ఒకటైన సురేష్ ప్రొడక్షన్స్, వేఫారేర్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమాలో సముద్రఖని ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాగా.. తాజాగా మరో అప్డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాను నిర్మిస్తున్న రానా ‘కాంత’లో డీటేక్టీవ్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా.. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా త్వరలో రాబోతున్నట్లు టాక్. ఇప్పటికే అన్నీ వర్క్స్ పూర్తి కాగా.. త్వరలో టీజర్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతున్నట్లు సమాచారం.

Next Story