‘గట్ట కుస్తీ 2’లో రమ్యకృష్ణ.. శక్తిస్వరూపిణి భాగం అయ్యారు అంటూ పోస్టర్ రిలీజ్

by Chukka Sudharani |

విష్ణు విశాల్ సినిమా ‘గట్ట కుస్తీ 2’లో రమ్య కృష్ణ భాగం అయినట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.

‘గట్ట కుస్తీ 2’లో రమ్యకృష్ణ.. శక్తిస్వరూపిణి భాగం అయ్యారు అంటూ పోస్టర్ రిలీజ్
X

దిశ, సినిమా: స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రాల్లో ‘గట్ట కుస్తీ’ ఒకటి. కోలీవుడ్ స్టార్ విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన ఈ మూవీ 2022లో వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గట్ట కుస్తీ 2’ రాబోతున్నట్లు ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. భార్యాభర్తల మధ్య ఈగోలు, కుస్తీ నేపథ్యంలో వచ్చిన ఫస్ట్ పార్ట్ విపరీతమైన ప్రజాదారణ పొందగా.. సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. జూలై 3న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక రిలీజ్ సమయం దగ్గరపడుతున్న క్రమంలో ఇందులో నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ గట్ట కుస్తీలో టాలీవుడ్ రాజమాత శివగామి (రమ్యకృష్ణ) భాగం కాబోతున్నట్లు తెలుపారు. ‘ఈ శక్తిస్వరూపిణి గట్ట కుస్తీ 2 బృందంలో చేరారు.. ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్ర కోసం మా చిత్ర బృందంలో భాగమైనందుకు మేము ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నాము. 'రాజా రాజేశ్వరి' పాత్రలో ఆమెను వీక్షించండి’ అంటూ తెలిపారు. ప్రజెంట్ ఈ పోస్టర్ వైరల్ అవుతుండగా.. మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది.

Next Story