థియేట‌ర్ లో ర‌మ్య‌కృష్ణ‌ ఎమోష‌న‌ల్..వీడియో వైర‌ల్‌

by velandi.Saikiran |

హీరోయిన్ రమ్యకృష్ణ మురిసిపోయిన వీడియో వైరల్ గా మారింది. తన కెరీర్ లో ఐకానిక్ పాత్ర అయిన నీలాంబరిని వెండితెరపై

థియేట‌ర్ లో ర‌మ్య‌కృష్ణ‌ ఎమోష‌న‌ల్..వీడియో వైర‌ల్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ సీనియర్ నటి రమ్యకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్నో ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న రమ్యకృష్ణ, అప్పట్లో బడా హీరోల సరసన హీరోయిన్ గా నటించి అందరిని ఆకట్టుకుంది. హీరోయిన్ గానే కాకుండా ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది రమ్యకృష్ణ. ఇక ఇప్పుడు హీరో తల్లి, లేదా హీరోయిన్ తల్లి పాత్రల్లో కనిపించి మెప్పిస్తోంది.

అయితే అలాంటి అలనాటి హీరోయిన్ రమ్యకృష్ణ మురిసిపోయిన వీడియో వైరల్ గా మారింది. తన కెరీర్ లో ఐకానిక్ పాత్ర అయిన నీలాంబరిని వెండితెరపై చూసి మురిసిపోయారు రమ్యకృష్ణ. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘నరసింహ’ సినిమా ఇటీవల రీ-రిలీజ్ అయింది. ఈ సందర్భంగా స్వయంగా ఆమె థియేటర్ కు వెళ్లి.. ఈ సినిమాను తిలకించారు. మొదటిసారి ఈ సినిమాను థియేటర్ లో చూశాను అంటూ ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వీడియోను కూడా పంచుకున్నారు రమ్యకృష్ణ. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. క్లిక్

Next Story