- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘AA22’లో ఆ స్టార్ నటి.. బాహుబలి రేంజ్ హిట్ కన్ఫర్మ్ అంటున్న ఫ్యాన్స్
‘పుష్ప-2’ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఓ భారీ ప్రాజెక్ట్‌ను ఓకే చేసిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: ‘పుష్ప-2’ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఓ భారీ ప్రాజెక్ట్‌ను ఓకే చేసిన విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ‘AA22’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్నది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్న ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమా నుంచి పత్రీ అప్డేట్ ప్రేక్షకుల్లో ‘AA22’పై భారీ అంచనాలు పెంచేశాయి. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న మరో న్యూస్ ఈ సినిమాను వేరే స్థాయికి తీసుకెళ్తున్నాయి.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ ప్రాజెక్టులో స్టార్ నటి రమ్య కృష్ణ (Ramya Krishna) కూడా భాగంగ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుటికే రమ్యకృష్ణను మూవీ సంస్థ సంప్రదించగా.. కథ నచ్చడంతో ఆమె కూడా ఓకే చేసినట్లు టాక్. ఈ సినిమాలో రమ్య కృష్ణ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక అన్నీ కుదిరితే దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందట. అయితే.. ఈ వైరల్ అవుతున్న న్యూస్ ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, మా శివగామి ఈ సినిమాలో యాక్ట్ చేస్తుందంటే బొమ్మ బ్లాక్ బస్టరే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. లింక్






