ఆర్జీవీలో ఈ యాంగిల్ కూడా ఉందా?

by Ajay Maddhiboyina |

త‌ల్లి దండ్రులు త‌న‌కు వ్య‌క్తిగా జ‌న్మ‌నిస్తే డైరెక్ట‌ర్‌గా నాగార్జున జన్మనిచ్చారని రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆర్జీవీ మాట్లాడుతూ..శివ సినిమాతో తనకు డైరెక్టర్‌గా జన్మనిచ్చింది నాగార్జునే అని చెప్పారు.

ఆర్జీవీలో ఈ యాంగిల్ కూడా ఉందా?
X

దిశ, వెబ్ డెస్క్: త‌ల్లి దండ్రులు త‌న‌కు వ్య‌క్తిగా జ‌న్మ‌నిస్తే డైరెక్ట‌ర్‌గా నాగార్జున జన్మనిచ్చారని రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆర్జీవీ మాట్లాడుతూ..శివ సినిమాతో తనకు డైరెక్టర్‌గా జన్మనిచ్చింది నాగార్జునే అని చెప్పారు. ఆ సమయంలో నువ్వు నమ్మిందే చేయాలని నాగార్జున తనను పట్టుపట్టారని తెలిపారు. అనుభవం లేని తనను నమ్మింది నాగార్జున అన్నారు. ఎన్నో సమస్యలు ఎదురైనా నాగార్జున తనకు అండగా నిలిచారని చెప్పారు. నాగార్జున‌తో చేసిన శివ సినిమా టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తరవాత ఆర్జీవీ బాలీవుడ్ ఆఫర్లను సైతం అందుకున్నారు.

బాలీవుడ్ లో అమితాబచ్చన్‌తో షోలే సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ తరవాత కూడా బాలీవుడ్‌లో పలు చిత్రాలు చేసి ఆ ఇండస్ట్రీకే బాద్ షాగా నిలిచారు. ఇక ప్రస్తుతం తన సినిమాలు ఆడకపోయినా నచ్చిన కథలనే సినిమాలుగా చేస్తూ తనకు నచ్చినట్టుగా బతుకుతున్నారు. ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ సాధారణంగా ఏ విషయాన్ని కూడా ఎమోషనల్ గా తీసుకోరు. ఎవ్వరిపై ప్రశంసలు కురిపించరు. కానీ ఆయన మొదటిసారి నాగార్జున గురించి గొప్పగా చెబుతూ ఎమోషనల్ అవ్వడంతో నాగార్జునలో ఈ యాంగిల్ కూడా ఉందా అని మూవీ లవర్స్ ఆశ్చర్యపోతున్నారు.

Next Story