డాగ్ లవర్స్‌కు ఆర్జీవీ 10 ప్రశ్నలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-16 10:31:38  IST  )

ఢిల్లీలోని వీధి కుక్క‌ల‌ను షెల్ట‌ర్ల‌కు త‌ర‌లించాలి అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై డాగ్ ల‌వ‌ర్స్ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

డాగ్ లవర్స్‌కు ఆర్జీవీ 10 ప్రశ్నలు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఢిల్లీలోని వీధి కుక్క‌ల‌ను షెల్ట‌ర్ల‌కు త‌ర‌లించాలి అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై డాగ్ ల‌వ‌ర్స్ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా డాగ్ ల‌వ‌ర్స్ కు డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ 10 ప్ర‌శ్న‌లు వేశారు. వీధి కుక్క‌లు ప్ర‌జ‌ల‌ను క‌రిచి చంపుతుంటే, వాటిని ప్రేమించే వాళ్లు డాగ్స్ హ‌క్కుల గురించి ట్వీట్ చేయ‌డంలో బిజీగా ఉన్నార‌ని అన్నారు. మీరు విలాస‌వంత‌మైన ఇళ్ల‌లో పెంపుడు జంతువుల‌ను ప్రేమించ‌వ‌చ్చు. కానీ వీధి కుక్క‌ల బాధితుల‌కు, వారిని ప్రేమించేవారిపై జాలి ప‌డక‌పోవ‌డం అస‌భ్య‌క‌రం అని అన్నారు. ధ‌న‌వంతులు జాతి కుక్క‌ను పెంచుకుంటున్నారు. పేద ప్ర‌జ‌ల‌ను వీధి కుక్కులు క‌రిచి చంపేస్తున్నాయి. కానీ డాగ్ ల‌వ‌ర్స్ దీని గురించి మాట్లాడ‌రు. ఒక మ‌నిషి చంపితే హంత‌కుడు, అదే కుక్క చంపితే దాన్ని ప్ర‌మాదం అంటారు. మ‌రి మ‌నుషులు చంపినా కూడా ప్ర‌మాదం అని చెబుతారా? అని ప్ర‌శ్నించారు.

మీరు కుక్క‌ల కోసం ఏడుస్తారు, కానీ చ‌నిపోయిన మ‌నుషుల కోసం ఏడ‌వ‌రు. సానుభూతిని కూడా ఇలా డివైడ్ చేసుకోవ‌చ్చ‌ని నాకు తెలియ‌దు అన్నారు. డాగ్ ల‌వ‌ర్స్ వాటిని చంపొద్దు అనే బదులు ఎందుకు ద‌త్త‌త తీసుకోరు అని ప్ర‌శ్నించారు. అవి తక్కువ జాతికి చెందిన‌వి, చెత్త‌లో ఉంటాయి కాబ‌ట్టి మీ కుటుంబ స‌భ్యుల‌కు జ‌బ్బులు రాకుండా ఉండాల‌నే క‌దా? అని అడిగారు. నిజాయితీ లేకుండా జాలి ప‌డ‌టం కూడా జాలి కాదు.. అది ఒక క్రూర‌త్వం అని పేర్కొన్నారు. గేటెడ్ క‌మ్యునిటీల‌లో వీధి కుక్క‌లు దాడి చేయ‌వ‌ని, గేట్లు లేని పేద‌ల‌పైనే అవి దాడి చేస్తాయ‌న్నారు. ఒక త‌ల్లి త‌న బిడ్డ‌ను కుక్కలు క‌రిచి చంప‌డం చూస్తుంది. మీరు ఆమె కోసం ఎందుకు హ్యాష్ ట్యాగ్ సృష్టించ‌కూడ‌ద‌ని ప్ర‌శ్నించారు. కుక్క‌ల‌కే కాకుండా అన్ని జంతువుల‌కు జీవించే హ‌క్కు ఉండ‌వ‌చ్చు. కానీ అది మాన‌వ జీవితాల‌ను ప‌ణంగా పెట్ట‌గ‌ల‌దా? అని ప్ర‌శ్నించారు.

Also Read..

ధనవంతుల సంతోషం కోసం పేదలు తమ రక్తంతో మూల్యం చెల్లించాల.. సంచలనంగా స్టార్ డైరెక్టర్ పోస్ట్

Next Story