Ram Charan: రామ్ చరణ్‌కు గాయం.. షూటింగ్ వాయిదా !

by velandi.Saikiran |   (  Updated:2026-03-24 21:15:25  IST  )

పెద్ది సినిమా సెట్స్‌లో రామ్ చరణ్‌కు కంటి దగ్గర చిన్న గాయం అయిన‌ట్లు స‌మాచారం. దీంతో షూటింగ్ వాయిదా ప‌డింది.

Ram Charan: రామ్ చరణ్‌కు గాయం.. షూటింగ్ వాయిదా !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా RRR లాంటి పెద్ద సినిమాలో హీరోగా చేసి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయారు చరణ్. ఇక ఇప్పుడు వరుసగా అన్ని పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తున్నారు.

రామ్ చరణ్ కు గాయం అయినట్లు వార్తలు?

పెద్ది సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఊహించని పరిణామం ఎదురయింది. రామ్ చరణ్ కంటికి గాయమైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. పెద్ది సినిమా కోసం యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. అయితే రామ్ చరణ్ కంటికి అయిన గాయం చాలా చిన్నదని, దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు సూచించినట్టు టాక్ నడుస్తోంది.

రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచనలు కూడా చేశారట. ఈ న్యూస్ బయటకు రావడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. వెంటనే రాంచరణ్ కోలుకొని ఎప్పటి లాగే షూటింగ్ లో ఫినిష్ చేసుకోవాలి కోరుతున్నారు. అయితే రామ్ చరణ్ కు గాయమైనట్లు వస్తున్న వార్తలపై ఇప్పటి వరకు చిత్ర బృందం ప్రకటన చేయలేదు. క్లిక్

Next Story