Rambha: కష్టం మొత్తం ఆ స్టార్ హీరోది.. క్రెడిట్ మాత్రం నాకు

by Pulgam srinivas |

రంభ మాట్లాడుతూ... “నాచోరే నాచోరే” సాంగ్ కోసం ఎన్టీఆర్ ఎంతో కష్టపడ్డాడని, కానీ క్రెడిట్ మాత్రం తనకే వచ్చిందని రంభ సరదాగా చెప్పుకొచ్చింది.

Rambha: కష్టం మొత్తం ఆ స్టార్ హీరోది.. క్రెడిట్ మాత్రం నాకు
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ రంభ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు అయిన బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకొని ఎన్నో సంవత్సరాల పాటు తిరుగులేని నటిగా కెరీర్‌ను కొనసాగించింది. ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉన్న ఈమె, తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

రంభ మాట్లాడుతూ... ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్న అల్లు అర్జున్ మరియు జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో తాను స్పెషల్ సాంగ్స్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంది. ముఖ్యంగా యమదొంగ సినిమాలోని “నాచోరే నాచోరే” సాంగ్ తనకు మంచి గుర్తింపు తెచ్చిందని చెప్పింది. ఆ సాంగ్ ప్రభావంతో “నాచోరి నా చోలే విత్ రంభ” అనే టీవీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించినట్లు తెలియజేసింది. ఆ పాటలో ఎన్టీఆర్ ఎంతో కష్టపడ్డాడని, కానీ క్రెడిట్ మాత్రం తనకే వచ్చిందని సరదాగా చెప్పుకొచ్చింది.

డాన్స్ విషయానికి వస్తే చిరంజీవి అంటే చాలా ఇష్టం అని, ఆయనకు తాను పెద్ద అభిమానినని తెలిపింది. అయితే బెస్ట్ డాన్సర్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అని స్పష్టంగా చెప్పింది. ఆయన డాన్స్ కోసం చాలా కష్టపడతాడని కూడా వెల్లడించింది. సమకాలీన నటీమణుల గురించి మాట్లాడుతూ, రమ్యకృష్ణ తనకంటే సీనియర్ కావడంతో ఆమెను చూసి మొదట భయమేసేదని, కానీ ఆమె ఎంతో సరదాగా ఉండేదని చెప్పింది. ఇక ప్రస్తుత హీరోయిన్లలో త్రిష అంటే తనకు చాలా ఇష్టమని, కొన్ని సందర్భాల్లో కలిసినప్పుడు ఆమె ఎంతో ఆప్యాయంగా మాట్లాడిందని రంభ పేర్కొంది.

Next Story