మహా శివరాత్రికి రామాయణ అప్డేట్

by Sujitha Rachapalli |

భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద ప్రాజెక్ట్‌లలో ఒకటిగా ఉండబోతుంది ‘రామాయణ’. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ నటిస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

మహా శివరాత్రికి రామాయణ అప్డేట్
X

దిశ, సినిమా : భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద ప్రాజెక్ట్‌లలో ఒకటిగా ఉండబోతుంది ‘రామాయణ’. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ నటిస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా.. ఈ ఇద్దరితో కలిసి ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో కన్సర్ట్ ప్లాన్ చేసినట్లు టాక్. ఈ ఇద్దరు దిగ్గజాల మ్యూజిక్‌తో అలాంటి గ్రాండ్ ఈవెంట్ రావడంపై ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. మహా శివరాత్రి కానుకగా టీజర్ దాదాపు కన్ఫర్మ్ అని తెలుస్తుండగా.. శ్రీ రామ నవమి సందర్భంగా రణ్‌బీర్ క్యారెక్టర్ టీజర్ లేదా పెద్ద ఈవెంట్ ఉండబోతుందనే రూమర్స్ ఉన్నాయి. ఇక కామిక్ కాన్లో 48 భాషల్లో ట్రైలర్ లాంచ్ + The Odysseyతో అటాచ్ అనేది ఇంకా రూమర్‌గానే ఉంది. నాలుగు వేల కోట్ల భారీ బడ్జెట్‌తో నితేశ్ తివారి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ 2026 దీపావళికి, సెకండ్ పార్ట్ 2027 దీపావళికి రిలీజ్ చేస్తారని సమాచారం.

Next Story