హనుమాన్ జయంతి కానుకగా 'రామాయణ' టీజర్: రాముడిగా రణబీర్ కపూర్ విశ్వరూపం!

by Malleboina Mahesh |   (  Updated:2026-04-02 05:01:28  IST  )

రామాయణ టీజర్ విడుదల! శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి. హనుమాన్ జయంతి కానుకగా అదిరిపోయే విజువల్స్. 2026 దీపావళికి రిలీజ్.

హనుమాన్ జయంతి కానుకగా రామాయణ టీజర్: రాముడిగా రణబీర్ కపూర్ విశ్వరూపం!
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా, సాయి పల్లవి (Sai Pallavi) సీతా దేవిగా నటిస్తున్న రామాయణం సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో సుమారు రూ. 4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక 'రామాయణ' టీజర్ ('Ramayana' teaser) నేడు విడుదలైంది. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని దర్శకుడు నితీశ్ తివారీ ఈ చిత్ర మొదటి గ్లింప్స్‌ను "రామ" (Rama) పేరుతో విడుదల చేశారు. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కూడిన ఈ టీజర్ ప్రేక్షకులను ఒక సరికొత్త ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్తోంది. కేవలం విడుదలైన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ఈ టీజర్ టాప్ ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది.

ఈ టీజర్‌లో శ్రీరాముడిగా రణబీర్ కపూర్ లుక్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆయన ముఖంలోని ప్రశాంతత, రాజసం రాముడి పాత్రకు పరిపూర్ణతను తెచ్చాయని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇక సీతమ్మగా సాయి పల్లవి తనదైన సహజత్వంతో మెప్పించగా, రావణుడిగా కన్నడ స్టార్ యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నట్లు ఈ గ్లింప్స్ ద్వారా చిత్ర యూనిట్ అధికారికంగా ధృవీకరించింది. ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ అందించిన సంగీతం టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రంలో మొదటి భాగం 2026 అక్టోబర్‌లో దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

టీజర్ లింక్

Next Story