- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రమణ గోగుల గుండు వెనక ఇంత పెద్ద స్టోరీ ఉందా?
రమణ గోగుల తన భార్యకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నార్మల్ డెలివరీ జరగడంతో, ఇకపై ఎప్పుడూ గుండుతోనే ఉంటానని మొక్కుకున్నట్లు తెలుస్తోంది. ఆ మొక్కు కారణంగానే ఆయన ఎప్పుడూ గుండుతోనే కనిపిస్తున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో తన సంగీతంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న మ్యూజిక్ డైరెక్టర్లలో రమణ గోగుల ఒకరు. ఈయన కేవలం సినిమాలకు సంగీతం అందించడమే కాకుండా, కొన్ని పాటలను స్వయంగా ఆలపించి కూడా శ్రోతలను మెప్పించారు. చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆయన, ఇటీవల విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలోని ‘గోదావరి గట్టుపైన’ పాటను ఆలపించారు. ఈ పాట భారీ స్థాయిలో విజయం సాధించడంతో ఆయనకు మళ్లీ మంచి క్రేజ్ వచ్చింది. ఇకపోతే, రమణ గోగుల ఎప్పుడూ గుండుతో కనిపించడం అందరికీ తెలిసిందే.
ఎందుకు ఆయన ఎప్పుడూ గుండుతోనే ఉంటారనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే ఆయన ఎప్పుడూ గుండుతో ఉండటానికి ఒక ప్రత్యేక కారణం ఉన్నట్లు తెలుస్తోంది. రమణ గోగుల ‘జానీ’ సినిమాకు పని చేస్తున్న సమయంలో ఆయన భార్య గర్భవతిగా ఉన్నారట. ఆ సమయంలో డెలివరీ కోసం ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, డెలివరీ కొంత క్లిష్టంగా ఉండే అవకాశం ఉందని వైద్యులు చెప్పారట. దీంతో ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యారట. అప్పుడు ఆయన టీమ్‌లోని ఒక వ్యక్తి, తిరుపతికి వెళ్లి మొక్కు తీర్చుకోవాలని సూచించాడట.
ఆ సలహా మేరకు ఆయన తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయంకు వెళ్లి మొక్కు తీర్చుకొని తలనీలాలు సమర్పించారట. ఆ తర్వాత ఆశ్చర్యకరంగా ఆయన భార్య ఆరోగ్యం మెరుగుపడి, నార్మల్ డెలివరీ సాఫీగా జరిగిందట. ఈ ఆనందకరమైన సంఘటన తర్వాత ఆయన ఎప్పుడూ గుండుతోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచి రమణ గోగుల గుండుతోనే కనిపిస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది.






